జిల్లాలో దానిమ్మ ధరలు పెరుగుతాయన్న అంచనా
సత్యసాయి: జిల్లాలో వర్షాల కారణంగా కొద్ది రోజుల్లో దానిమ్మ ధరలు తక్కువగా ఉన్నాయి, త్వరలో పెరుగుతాయని ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్ తెలిపారు. అలాగే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 18 వేల ఎకరాల దానిమ్మ పంట సాగులో ఉంది అన్నారు.