VIDEO: జాతీయ రహదారిని కమ్మేసిన పొగ మంచు
ASR: పోలవరం, అల్లూరి జిల్లాల మీదుగా వెళ్లే 516E జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. ముఖ్యంగా రంపచోడవరం నుండి పాడేరు వెళ్లే మార్గంలో విజిబిలిటీ తగ్గి, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నెమ్మదిగా, లైట్లు వేసుకుని అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు.