కల్తీదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న టాస్క్ ఫోర్స్
HYD: నగరంలో గత కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ అధికారులు కల్తీదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా మరో కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నంలోని అలియా ఐస్‌క్రీమ్ పార్లర్‌లో హానికర రసాయనాలతో ఐస్ క్రీమ్స్‌ని తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రూ.5.44 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని యజమాని ముషరఫ్‌ద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.