ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల

AP: రాజధాని అమరావతికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు అని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల అన్నారు. 'రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60వేల కోట్ల రుణం తెస్తున్నారు? వడ్డీల భారం మోసేదెలా? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాలపై అప్పుల భారం ఎందుకు మోపుతున్నారు?' అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.