VIDEO: భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ దేవాలయం శ్రీరామనవమి సందర్భంగా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.