'రెడ్‌బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరింది'

NDL: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో గురువారం నిర్వహించిన సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అవినీతిపరులను సీఎం చంద్రబాబు నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.