రేపు ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే పర్యటన

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మండలంలోని నిడిముసలి శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన నూతన విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని నేతలు కోరారు.