భోజనం తర్వాత స్మోకింగ్ చేస్తున్నారా?
భోజనం తర్వాత తాగే ఒక సిగరెట్.. సాధారణ సమయం కంటే 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఆహారంలోని విటమిన్లు, ఖనిజాల గ్రహణ శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాటుకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిది.