VIDEO: కార్మికుల పిల్లలు కార్మికులు కాకూడదు

SKLM: నరసన్నపేట భవన నిర్మాణ కార్మికులు గురువారం కలాశి యూనియన్ ఆవరణలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనలో ప్రతి ఒక్క కార్మికునికి మేడే యొక్క ప్రాముఖ్యతను ఎమ్మెల్యే వివరించారు. కార్మికుల పిల్లలు కార్మికులు కాకూడదని అన్నారు.