ప్రచారంలో కొబ్బరి బొండం కొడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి

HYD: ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం రాజకీయ నేతలు చేయని పనులు, పడరాని పాట్లు ఉండవనేది జగమెరిగిన సత్యమే. ఈరోజు కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఇల్లు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పనిలో పనిగా కొబ్బరి బొండాం బండి వద్దకు చేరుకున్న గణేష్ స్వయంగా కొబ్బరి బోండాలు కొట్టి నేతలకు కొబ్బరి నీళ్లు తాగించారు.