ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
AKP: కోటవురట్లలో మంగళవారం ఉదయం ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రఘురాం ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. ఈనెల 15వ తేదీ లోగా అందరూ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. కాగా ఇప్పటివరకు మండలంలో 50% పైగా ఇంటి పన్నులు వసూళ్లు చేసినట్లు తెలిపారు.