ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాడ్స్ నగరంలోని సైనిక ప్రాంతంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అంతేకాకుండా ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరో వైపు ఒమన్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది.