వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

NRPT: నారాయణపేట పట్టణంలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని అన్నారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.