వారిపై కేసులు నమోదు చేస్తాం: కలెక్టర్

వారిపై కేసులు నమోదు చేస్తాం: కలెక్టర్

ప్రకాశం: జిల్లాలో అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.