కొండికిండాంలో MSME పార్కు శంకుస్థాపన

విజయనగరం: బొండపల్లి మండలం కొండకిండాం సమీపంలో రూ.17.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న MSME పార్క్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల ద్వారా ప్రతి నియోజకవర్గంలో స్థానిక యువతకు ఉపాధి అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.