ఉగ్ర కుట్ర కేసులో కీలక విషయాలు

ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వీరు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహరచన చేసినట్లు తెలిపారు. దేశంలోని కొంతమంది నేతలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడుల కోసం సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. దీనికోసం ఆత్మాహుతి జాకెట్లు, బాంబులు సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.