అడవిలో చెలరేగిన మంటలు
CTR: కార్వేటినగరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రతి రోజు ఏదో ఒకచోట అడవికి నిప్పు అంటుకుంటోంది. మండల నలుమూలల ఎక్కువగా అటవీ ప్రాంతమే ఉంది. వేసవి సమయంలో అడవులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎకరాలుగా కాలిపోతోంది. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. నిన్న సాయంత్రం ఆర్కేవీబీపేట సమీపంలో అడవికి నిప్పు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి.