దుర్వాసనతో ఉండలేకపోతున్నాం..!

VZM: బొబ్బిలి వెంకటకృష్ణ థియేటర్ సమీపంలో రెండు రోజుల క్రితం కుక్క మరణించింది. దుర్వాసన అధికంగా రావడంతో ఉండలేకపోతున్నామనీ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం కుక్క చనిపోవడంతో కుళ్లి దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కుక్కను తీసి పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు.