VIDEO: 'ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
MHBD: పట్టణంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని టౌన్ సీఐ మహేంద్రరెడ్డి సూచించారు. సోమవారం హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత అతివేగం మానుకొని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.