ప్రతి ఇంటా ఆనంద దివ్వెలు వెలగాలి: ఎమ్మెల్సీ

ప్రతి ఇంటా ఆనంద దివ్వెలు వెలగాలి: ఎమ్మెల్సీ

KDP: బద్వేలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దుష్ట శిక్షణకు, శిష్ఠ రక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ పండుగను ప్రజలందరూ ఆత్మీయంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందపు కాంతులు వెదజల్లాలని, అజ్ఞానాంధకారాలు తొలగి విజ్ఞాన దీప్తులు వెలగాలని ఆయన ప్రార్థించారు.