అరటి రైతులది అరణ్య రోదన: వైఎస్ షర్మిల
AP: రాష్ట్రంలో అరటి రైతుల జీవితం అరణ్య రోదనగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 'X' వేదికగా ఆరోపించారు. సిరులు కురిపించే అరటి పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోందన్నారు. రైతులను పంట నష్టం ముంచుతుంటే కూటమి ప్రభుత్వం వారి ఆక్రందనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. టన్ను ధర రూ.28 వేల నుంచి వెయ్యి రూపాయలకు పడిపోయిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.