హైదరాబాద్ శివారులో భారీగా బెల్లం పట్టివేత

HYD: హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు తరలిస్తున్న 570 కేజీల బెల్లం, 50 కేజీల ఆలాన్ని ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు నేతృత్వంలోని బృందం బుధవారం ఇబ్రహీంపట్నం బీయన్ రెడ్డి కాలనీ సమీపంలో పట్టుకుంది. సరుకు విలువ రూ.62 వేలు ఉంటుందని తెలిపింది. దానిని తరలించేందుకు ఉపయోగించిన కారును సీజ్ చేసి, డ్రైవర్ రాజును అరెస్ట్ చేశారు.