'మహిళల గౌరవం మన సంప్రదాయం'
SRPT: పనిచేసే చోట మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం సంస్థల బాధ్యతని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘పోష్’ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) తప్పనిసరని, వేధింపులకు గురైతే మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.