‘అంగన్వాడీల అరెస్ట్ మోసం'
ప్రకాశం: అంగన్వాడీ, ఆయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని CITU నాయకుడు షేక్ అన్వర్ అన్నారు. విజయవాడలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అంగన్వాడీల ధర్నా శిబిరంపై ప్రభుత్వం పాశవికంగా దాడిచేసి అరెస్టులు చేసిందని తెలిపారు. అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ప్రజాస్వామ్య హక్కులను హరించారని అర్థవీడులో నిరసన వ్యక్తం చేశారు.