ఎరువుల కొరత వాస్తవమే: మంత్రి

ఎరువుల కొరత వాస్తవమే: మంత్రి

TG: రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్న మాట వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కొంతమంది రైతులు ముందస్తుగా స్టాక్ పెట్టుకోవడం వల్లే ఈ కొరత ఏర్పడిందని తెలిపారు. అయితే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఎరువుల కొరతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.