సంచార చేపల విక్రయ వాహనం అందజేత

సంచార చేపల విక్రయ వాహనం అందజేత

KMR: ఇందిరా మహిళా శక్తి పథకం కింద నిజాంసాగర్‌(M) కేంద్రానికి చెందిన ఓ మహిళకు సంచార చేపల విక్రయ వాహనం మంజూరైంది. రాష్ట్ర మత్స్యశాఖ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు శనివారం లబ్ధిదారురాలికి అందజేశారు. మహిళల్లో వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్‌ కుమార్‌ ఉన్నారు.