పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన పూర్వ విద్యార్ది
MHBD: జిల్లా ఇనుగుర్తి మండలానికి చెందిన భుక్య శోభన్‌బాబు తాను చదువుకున్న పూర్వ పాఠశాల ప్రభుత్వ హైస్కూల్‌కు ఒక కంప్యూటర్‌ను విరాళంగా అందించారు. తన విజయానికి ఈ పాఠశాలే పునాది అని, సేవ చేయడం అదృష్టమని శోభన్‌బాబు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం దీనిని అందజేసానన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులున్నారు.