సదాశివపేట మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సదాశివపేట మార్కెట్ యార్డులోని ఉల్లిగడ్డల షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మార్కెట్‌లో ఉన్న రైతులు, వ్యాపారులు భయాందోళనతో బయటకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.