వింగ్స్ ఇండియా 2026లో కళ్లు చెదిరే విమాన విన్యాసాలు
HYD: బేగంపేట విమానాశ్రయంలో రెండవ రోజు వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన అద్భుతంగా జరిగాయి. ఏరోబాటిక్స్ బృందాలు ఆకాశంలో చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతూ పైలెట్లు నగరాన్ని మొత్తం చుట్టేశారు. బేగంపేటలో ఎగిరిన జెట్ స్పీడ్ విమానాలు జూబ్లీహిల్స్, ఐటీ కారిడార్ మీదుగా త్రివర్ణ రంగులు చల్లుతూ దూసుకెళ్లడం చూసిన నగరవాసులు మంత్రముగ్ధులయ్యారు.