మచ్చర్ల - బేతంచర్ల రోడ్డులో గుంతతో ప్రజలకు ఇబ్బందులు

మచ్చర్ల - బేతంచర్ల రోడ్డులో గుంతతో ప్రజలకు ఇబ్బందులు

MHBD: మచ్చర్ల నుంచి బేతంచర్ల మార్గంలో మున్వర్ గారి పొలం వద్ద ఉన్న కల్వర్టు పక్కన భారీ గుంత ఏడాది‌గా అలాగే ఉంది. ఈ మార్గంలో రైతులు, గ్రామ ప్రజలు, స్కూల్ పిల్లలు, బస్సులు ప్రతిరోజూ ప్రయాణిస్తుండగా ప్రమాద భయం పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించినవారికే ఓటు ఇస్తామంటూ గ్రామస్థులు స్పష్టంగా తెలిపారు. పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.