కొయ్యలగూడెంలో దివ్యాంగులకు ముఖ్య గమనిక..!

కొయ్యలగూడెంలో దివ్యాంగులకు ముఖ్య గమనిక..!

ELR: కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు భరోసా కల్పించే నిమిత్తం ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ కోరారు. గతంలో వాహనాలు కావాలని అడిగిన వారింటికి శనివారం స్వయంగా వెళ్లి వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.