హొంమంత్రి అనితకు కోటంరెడ్డి వినతి
NLR: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధి విస్తృతంగా ఉందని, దానిని విభజించి మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని TDP నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హోం మంత్రి అనితను కోరారు. ఈ మేరకు గురువారం అమరావతిలో ఆయన మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. నగరంలో నేరాలు అరికట్టడం ఇబ్బందికరంగా మారిందని, మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.