స్మార్ట్ రేషన్ కార్డులు..నేడే చివరి తేదీ
KDP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పొందేందుకు నేడే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. ఈలోగా తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్‌కు పంపుతారని పేర్కొన్నారు. అయితే, రేషన్ కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సచివాలయాల్లో రూ. 200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే, కార్డులు నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారని అధికారులు తెలిపారు.