బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించిన మలేరియా అధికారి
కోనసీమ: అమలాపురం మండలంలోని సమనస గ్రామంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా దోమల వలన వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. దోమల నివారణ చర్యలు చేపట్టడం పై స్థానిక సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ విష్ణుప్రియ పాల్గొన్నారు.