జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి
MBNR: మిడ్జిల్‌కు చెందిన మేడిపల్లి నరేందర్ రెడ్డి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల జిల్లాలోని పలువురు నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.