ఖేడ్‌లో అష్టదిక్కుల్లో అష్ట దేవాలయాలు
SRD: ఖేడ్ పట్టణానికి అష్ట దిక్కుల్లో అష్ట దేవాలయాలు వెలిసి, పట్టణం భక్తి పారవశ్యమైందని వేదస్మార్త గురురాజ శర్మ శుక్రవారం రాత్రి తెలిపారు. తూర్పున మార్కండేయ, దక్షిణాన అభయాంజనేయ, నైరుతిలో సత్యనారాయణ, పశ్చిమాన నగరేశ్వర్ వంటి ఆలయాలు వెలిశాయి. ఆగ్నేయ దిశలో తాజాగా విశాలాక్షివిశ్వనాథ మందిరం ప్రాణ ప్రతిష్ఠతో అష్ట దేవాలయాలు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.