తిమ్మారెడ్డిపల్లెలో వైసీపీ ఇంటింటి ప్రచారం

నెల్లూరు: వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ తిరుపతినాయుడు, ఆలీ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సోమవారం గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాల కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం జగన్ ప్రజారంజక పాలన అందించారని చెప్పారు.