ఫేక్ న్యూస్‌పై తుమ్మల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు
KMM: తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీతను గెలిపించాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు వచ్చిన ఫేక్ కథనాన్ని ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని బదనాం చేసేలా వార్త ప్రచురించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.