తణుకులో 61 బస్సులు సిద్ధం: ఆర్టీసీ డీఎం

W.G:ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తణుకు డిపో పరిధిలో 61 పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు సిద్ధం చేసినట్లు తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. డిపో పరిధిలో మొత్తం 16 రూట్లలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేయవచ్చని చెప్పారు.