అసంఘటిత రంగ కార్మికుల హక్కులపై అవగాహన

W.G: అసంఘటిత రంగ కార్మికుల హక్కుల పరిరక్షణకు చాలా చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి హనీష అన్నారు. భీమవరం UTF భవనంలో సోమవారం అసంఘటిత రంగ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హక్కులకు భంగం కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటారని అన్నారు.