VIDEO: గోనెగండ్లలో అగ్ని ప్రమాదం
KRNL: గోనెగండ్ల మండలం ఎర్రబాడులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మరి శ్రీనివాసులు తనకున్న గుడిసెలో పత్తి, ఆముదాలు భద్రపరచుకొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ధాన్యం, బట్టలు, పత్రాలు రూ. 50 వేల నగదు కాలి బూడిదయ్యాయని గ్రామస్థులు తెలిపారు.