ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ
అన్నమయ్య: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు–2025 సందర్భంగా రాయచోటిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో, విద్యుత్ పొదుపును ఇంటి నుంచే ప్రారంభించాలని, కార్యాలయాల్లోనూ విద్యుత్ ఆదా చేయడం అవసరమని ఆయన సూచించారు.