ఆశీర్వదించండి.. అభివృద్ధికి కృషి చేస్తా: పులివర్తి నాని

ఆశీర్వదించండి.. అభివృద్ధికి కృషి చేస్తా: పులివర్తి నాని

తిరుపతి: ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీడీపీ చంద్రగిరి ఇంచార్జ్ పులివర్తి నాని అన్నారు. మంగళవారం ఆయన రూరల్ మండలంలోని యోగి మల్లవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాల వైపు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.