VIDEO: 'పంట మార్పిడితో లాభాలు'
TPT: శ్రీకాళహస్తి మండలం తొండమనాడు రైతు సేవా కేంద్రంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం జరిగింది. AMC ఛైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న పథకాలు, సబ్సిడీల గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. వరి పంట కాకుండా కూరగాయలు వంటి పంటలు పండించి అధిక లాభాలు పొందాలని ఆయన సూచించారు.