సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే

CTR: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ సోమవారం లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించారు. తవణంపల్లి పంచాయతీ జోగివారిపల్లికి చెందిన బాబు రమేష్ కుటుంబానికి 65 వేల రూపాయలు చెక్కును అందించారు. రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకులు శరవన కుమార్ పాల్గొన్నారు.