చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రం గేట్ల ముందు చేపల వేటకు వెళ్లి వెంకటేష్ (35) అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన వెంకటేష్, పెద్ద గుంతలో వల గుంజబోయి అందులో మునిగిపోయాడు. గ్రామస్తులు సమాచారం అందుకుని పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.