స్ట్రాంగ్ రూమ్ CCTV ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మొహియుద్దీన్ నగర్ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద కొంతమంది వ్యక్తులు సీసీటీవీ నిలిపివేశారని అనుమానం వ్యక్తం చేసింది. బీహార్‌లో EVM ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. JDU-BJP కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తోందని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.