అంకిరెడ్డిపల్లిలో జూదంపై పోలీసుల మెరుపుదాడులు
KDP: కడప సబ్ డివిజన్ పరిధిలోని వి.ఎన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులు జూదంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 5 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.8,400 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వి.ఎన్ పల్లి ఎస్‌ఐ బి.వి. కృష్ణయ్య మీడియాకు వెల్లడించారు.