'జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన ఆపరేషన్లు'
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ముగ్గురికి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. 51 సంవత్సరాల మహిళకు గర్భసంచిలోని 3 గడ్డలు, మూత్రశయం, గర్భసంచి మధ్యలో గల మరో గడ్డను విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలకు ఆర్తోస్కోపిక్ విధానంలో కుడి భుజం, ఎడమ కాలుకు శస్త్ర చికిత్స చేసినట్లు ఆయన తెలిపారు.