అపరిశుభ్రతపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్లు
HYD: నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మూడు కార్పొరేషన్లు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రజలు కార్పొరేషన్ల కార్యాలయాలకు వెళ్లి అపరిశుభ్రతపై ఫిర్యాదు చేయాల్సిన అవసరంలేదని, ఉన్న చోటు నుంచే వాట్సాప్‌లో సమస్యలను తెలియజేయొచ్చన్నారు. GHMC, MMC, CMC అధికారులు చెత్తకుప్పలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు వాట్సాప్ 8125966586, 9063421300, 9063421347 నంబర్లను తీసుకొచ్చారు.